- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై హైప్ పెంచేసిన నాగవంశీ.. ఆసక్తికర కామెంట్స్ వైరల్ (వీడియో)
యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో రాబోతుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఇందులో నటీనటులు ఎవరెవరు ఉండబోతున్నారు అనే విషయంపై ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ (Naga Vamsi)ఆసక్తికర కామెంట్స్ చేసి హైప్ పెంచేశారు. ‘‘మా సినిమాను ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేసుకున్నాం.
త్రివిక్రమ్ మొదటిసారి మైథాలాజికల్ సినిమా తీస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్‌ను నేను అలా దేవుడిగా చూపించబోతున్నాను. ‘రామాయణ’ సినిమాను ప్రకటించిన తర్వాత దేశమంతా దాన్ని మాట్లాడుకుంటున్నారు. దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని కొన్ని రోజుల ఆపాం. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే.. త్రివిక్రమ్-వెంకటేష్ సినిమా ఆగస్టు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ పనులు మొదలుపెడతాము’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






