- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు పై జరిగిన గొడవ.. అసలు విషయం చెప్పిన నాగ శౌర్య
సెలబ్రిటీలు ఎవరు బయట కనిపించరు.

దిశ, వెబ్ డెస్క్ : సెలబ్రిటీలు ఎవరు బయట కనిపించరు. బయట కనిపించినా కూడా ఎవరితోనూ మాట్లాడకుండా, వచ్చిన పని చూసుకుని వెళ్లిపోతారు. కానీ హీరో నాగశౌర్య మాత్రం ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోని రోడ్డు పై ఓ అమ్మాయి, అబ్బాయి గొడవ పడుతుంటే మధ్యలోకి వెళ్లి.. వాళ్లకు ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సందర్భం రావడంతో అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పాడు.
'నేను పనిమీద కూకట్‌పల్లి నుంచి వెళ్తున్నాను. ఆ సమయంలో ఓ అబ్బాయి తన లవర్ ని కొట్టడం చూశాను. వెంటనే కారు ఆపి అతడి దగ్గరికి వెళ్లి అడిగాను.. ఆమెకు సారీ చెప్పమని అడిగాను. అతను మాట్లాడే లోపు ఆ అమ్మాయి 'నా భాయ్ ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు మీకేంటి?' అని నాకు రివర్స్ కౌంటర్ వేసింది. ఇక్కడ వచ్చిన ఇంకో రూమర్ ఏంటంటే.. ప్రచారం కోసం ఆ గొడవని నేనే ప్లాన్ చేశానని నా మీద ఎన్నో వార్తలు రాశారంటూ ' నాగశౌర్య చెప్పుకొచ‍్చాడు.
Also Read: పతనం వైపు అక్కినేని హీరోలు.. అలా చేయకపోతే రిస్క్‌లో పడ్డట్లేనా?






