పెళ్లి పీటలెక్కబోతున్న Naga Shaurya

by Seetharam |   (  Updated:2022-11-10 10:37:28  IST  )

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య.

పెళ్లి పీటలెక్కబోతున్న Naga Shaurya
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. రీసెంట్‌గా 'కృష్ణ వ్రిందా విహారి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగశౌర్య.. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానులకు తీపి కబురు అందించాడు.

మొత్తానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన ఈ యువ హీరోకు అనూష అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇక పెళ్లికి సంబంధించిన వేడుకలన్నీ బెంగళూరులో జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అమ్మాయి వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, నవంబర్ 20వ తేదీన బెంగళూరులోని JW మారియట్‌లో ఘనంగా వివాహం జరగనుంది.

Next Story