- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nepotismపై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నట వారసుడు నాగచైతన్య నెపొటిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ..

X
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నట వారసుడు నాగచైతన్య నెపొటిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. ''బాలీవుడ్‌లో కంటే సౌత్‌లోనే నెపోటిజం ప్రభావం ఎక్కువగా ఉంది. అయినా దీని గురించి ఎందుకు పదే పదే చర్చ జరుగుతుంది. అవును మా తాత నటుడు, మా నాన్న నటుడు.. చిన్నప్పటి నుంచి వాళ్లను చూస్తూ పెరిగాము. వారి స్ఫూర్తితో నేను కూడా యాక్టర్ కావాలని ఆశపడ్డాను.
వారు ఇండస్ట్రీలో నాకంటూ ఓ దారి చూపించారు. నేను నటించిన సినిమా, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి అనుకుందాం. నా సినిమా రూ. 10 కోట్లు సాధించి.. అతడి సినిమా రూ. 100 కోట్లూ సాధిస్తే దర్శకులు, నిర్మాతలు అతడి వెనుకే వెళతారు. నెపోటిజం వల్ల ఛాన్స్‌లు ఈజీగా రావొచ్చు కానీ, ఆడియన్స్ ఆధారించేది మాత్రం కంటెంట్ మాత్రమే'' అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.
Next Story






