Naga Chaitanya: మై లేడీ అంటూ ఆ హీరోయిన్‌కు విష్ చేసిన నాగచైతన్య.. సమంతకు ఎప్పుడైనా ఇలా విష్ చేశావా అంటూ దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ‘జోష్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చాడు.

Naga Chaitanya: మై లేడీ అంటూ ఆ హీరోయిన్‌కు విష్ చేసిన నాగచైతన్య.. సమంతకు ఎప్పుడైనా ఇలా విష్ చేశావా అంటూ దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ‘జోష్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక ‘ఏమాయ చేసావే’ (Ye Maaya Chesave)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సమయంలోనే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి కాపురం సజావుగా సాగలేదు. కొద్ది రోజులకే విడాకులు తీసుకుని విడిపోయారు. డైవర్స్ తర్వాత సమంత(Samantha) మయోసైటీస్ బారిన పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక ఈ నేపథ్యంలోనే.. నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూనే యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ(Sobhita Dhulipala )తో సీక్రెట్‌గా డేటింగ్ చేశారు. కొద్ది కాలానికి పెద్దలను ఒప్పించి నాగార్జున(Nagarjuna) సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

ఇక గతఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంట నిత్యం పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సినిమాల విషయానికొస్తే..చైతు ‘తండేల్’తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘NC-24’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక శోభిత మాత్రం పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ఇదిలా ఉంటే... తాజాగా, శోభిత పుట్టినరోజు కావడంతో నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బర్త్ డే విషెస్ తెలుపుతూ మై లేడీ అని పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సమంతకు ఇలా విష్ చేసావా.. నీ ఫ్యాన్ అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు దారుణంగా నాగచైతన్యను తిడుతున్నారు. అసలు ఎంతమంది మోసం చేస్తావని దుమ్మెత్తిపోస్తున్నారు.

Next Story