తిరుమలలో ప్రత్యేక పూజలు చేసిన నాగచైతన్య-శోభిత.. గుడ్ న్యూస్ ప్రకటించబోతున్నారా?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల ‘తండేల్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

తిరుమలలో  ప్రత్యేక పూజలు చేసిన నాగచైతన్య-శోభిత.. గుడ్ న్యూస్ ప్రకటించబోతున్నారా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల ‘తండేల్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘NC-24’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని దేవర డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. ఇక నాగచైతన్య పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని కొద్ది కాలానికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శోభిత(Sobhita Dhulipala)తో కొద్ది రోజులు డేటింగ్ చేసి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటినుంచి శోభిత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాకు కూడా దూరం అయింది. సడెన్‌గా.. నాగచైతన్య, శోభిత తిరుమల తిరుపతికి వెళ్లారు. తాజాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జంటగా తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇందులో నాగచైతన్య పట్టు పంచెలో కనిపించగా.. శోభిత ఎరుపు రంగు చీరలో పాపిట్లో బొట్టుతో అమ్మవారిలా ఉంది. ప్రస్తుతం వీరిద్దరి లుక్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సడెన్‌గా ఇలా చేశారు.. ఏదైనా గుడ్ న్యూస్ ప్రకటించబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శోభిత తల్లి కాబోతుందా? అందుకే తిరుమలకు వెళ్లారా అని చర్చించుకుంటున్నారు.

link

Next Story