Naga Chaitanya-sobhita: శోభితా-చైతూ పెళ్లి టైమ్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

by Anjali |
Naga Chaitanya-sobhita: శోభితా-చైతూ పెళ్లి టైమ్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: ఆగస్టు 8 వ తేదీన అక్కినేని హీరో నాగ చైనత్య అండ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకుని సడెన్‌గా ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. వీరి ఎంగేట్‌మెంట్ చేసుకున్నట్లు ముందుగా నటసామ్రాట్ నాగార్జున ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి అక్కినేని వారసుడి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా శోభితా-నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ ఫొటోలే కనిపిస్తున్నాయి. వీరి వార్తలే వినిపిస్తున్నాయి. అయితే అన్ని పనులు సవ్యంగానే సాగుతున్నాయి. మరీ శోభితా-చై డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడు? ఎక్కడ అనేదానిపై నెట్టింట తీవ్ర చర్చ కొనసాగుతోంది.

అయితే వీరి వివాహం రాజస్థాన్‌లో లేదా ఫారిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిపించాలని అనుకుంటున్నారట. అలాగే నాగ చైతన్య నటిస్తోన్న తండేల్ మూవీ విడుదల అనంతరం చై-శోభితా వివాహం చేసుకుంటారట. ఆలోపు శోభితా కూడా తన సినిమాలన్నీ కంప్లీట్ చేసుకునే యోచనలో ఉందట. కాగా ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనుందట. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Read More..

చైతన్య, శోభిత దాంపత్య జీవితంపై మరో జ్యోతిష్కుడు సంచలన వ్యాఖ్యలు.. ఆమె వల్లే నాగ చైతన్య లైఫ్ అలా అవుతుందంటూ



Next Story

Most Viewed