Naga Chaitanya Shobhita Engagement: ఒకటి కాబోతున్న నాగచైతన్య- శోభిత.. అధికారికంగా ప్రకటించిన నాగ్ (పోస్ట్)

by sudharani |   ( Updated:2024-08-08 08:24:30.0  )
Naga Chaitanya Shobhita Engagement: ఒకటి కాబోతున్న నాగచైతన్య- శోభిత.. అధికారికంగా ప్రకటించిన నాగ్ (పోస్ట్)
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై ఈ జంట ఏ రోజు స్పందించలేదు. కానీ.. ఈరోజు శోభిత, నాగచైతన్యకు ఎంగేజ్మెంట్ అయినట్లు పలు వెబ్ సైట్స్‌లో వార్తలు జోరందు కున్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలే నిజం అయ్యాయి. వాళ్లిద్దరూ అఫిషియల్‌గా ఒక్కటి అయ్యారు. ఈరోజు ఉదయం 9:42 AM కు శోభిత ధూళిపాళ తో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. దీనిపై అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. అక్కినేని నాగార్జున తన X ఖాతా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు "ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది!! ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదిస్తాడు!" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే.. సమంత ఫ్యాన్స్ మాత్రం షాక్‌కు గురవుతున్నారు.

Advertisement

Next Story