- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాప్ దర్శకుడితో చేతులు కలిపిన నాగచైతన్య.. మరోసారి భారీ రిస్క్?
నాగచైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఒక ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మైథికల్ మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నాగచైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఒక ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఒకప్పుడు తనదైన మాస్, యాక్షన్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన కోలీవుడ్ సీనియర్ దర్శకుడు లింగుసామి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
తెలుగులో రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్’ మూవీ తీసి భారీ డిజాస్టర్ అందుకున్న లింగుసామి.. ఇటీవల చైతు కోసం ఒక పవర్ ఫుల్ మాస్ కథను సిద్ధం చేశారట. ఆ కథ విన్న నాగచైతన్యకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ వార్త విన్న అక్కినేని అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. ఎందుకంటే, గతంలో నాగచైతన్య కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన ‘కస్టడీ’ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఫామ్‌లో లేని మరో కోలీవుడ్ దర్శకుడు లింగుసామితో చైతు రిస్క్ చేస్తుండటంతో.. ఈసారైనా హిట్ కొడతాడా? లేదా మళ్లీ పాత ఫలితమే రిపీట్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






