- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని ఫ్యామిలీ మ్యాటర్స్.. శోభిత ధూళిపాళ్లను వెనకేసుకొచ్చిన చైతు?
అక్కినేని నాగ చైతన్య కెరీర్ విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా చై చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ పర్సన్.

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య కెరీర్ విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా చై చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ పర్సన్. కాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య తన మనసులోని బాధను బయటపెట్టాడు. ‘నా గురించి, నా సినిమాల గురించి ఎవరు ఏమనుకున్నా, ఎలా రాసినా నేను పట్టించుకోను. అందులో మంచిని తీసుకుంటాను, అలాగే చెడును దాటి వెళ్ళిపోతాను. కానీ నాతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను నా జీవితంతో ముడివేసి ఏదైనా మాట్లాడితే మాత్రం తట్టుకోలేను. కుటుంబం జోలికి వస్తే మరింత బాధపడతాను. నాలో నేనే కృంగిపోతా. దీని గురించి మొదటిసారిగా నేను మాట్లాడుతున్నాను. నా వ్యక్తిగత విషయాలతో మీడియాకు సంబంధం లేదు. ఇక పైన ఇలాంటి తప్పుడు ప్రచారాలు రావని ఆశిస్తున్నా’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. కాగా దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్.. ఈయన ఇండైరెక్ట్‌గా శోభితను వెనకేసుకొచ్చాడా ఏంటి అని కామెంట్ చేస్తున్నారు.
Also Read.
మెగా వారసురాలు పుట్టింది ఏ టైం.. ఆమె జాతకం గురించి చిరంజీవి ఎమోషనల్ స్పీచ్






