నాగ చైతన్య డెబ్యూ మూవీపై ఆమిర్ ఖాన్ క్లారిటీ.. అనుకున్నట్లుగానే..

by Web Desk |
నాగ చైతన్య డెబ్యూ మూవీపై ఆమిర్ ఖాన్ క్లారిటీ.. అనుకున్నట్లుగానే..
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ అరంగేట్రానికి సన్నద్ధం అవుతున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'తో చై తన బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేశాడు. అయితే ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల కారణంగా పెద్దపెద్ద సినిమాలే విడుదలను వాయిదా వేస్తున్నాయి. కాబట్టి 'లాల్ సింగ్ చడ్డా' చెప్పిన టైంకి రాడేమో అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా వీటిపై మూవీ టీం స్పందించింది.

ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తున్న 'లాల్ సింగ్ చడ్డా' సినిమా రిలీజ్ డేట్‌లో ఎటువంటి మార్పు లేదని తేల్చి చెప్పేశారు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. సినిమా అనుకున్న విధంగానే ఏప్రిల్ 14న విడుదల అవుతుందని మరోసారి అధికారికంగా ప్రకటించింది. మరి చై తన ఎంట్రీతో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.

https://twitter.com/taran_adarsh/status/1484472067990822916?s=20



Next Story

Most Viewed