చిరంజీవి భార్య సురేఖ గురించి అసలు నిజాలు బయటపెట్టిన నాగబాబు

by Bhoopathi Nagaiah |

ఇండస్ట్రీలో అన్నదమ్ములు కలిసి వచ్చి ఫ్యామిలీ పరంగా కూడా ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు పడకుండా ఉన్న ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే చెప్పాలి.

చిరంజీవి భార్య సురేఖ గురించి అసలు నిజాలు బయటపెట్టిన నాగబాబు
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో అన్నదమ్ములు కలిసి వచ్చి ఫ్యామిలీ పరంగా కూడా ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు పడకుండా ఉన్న ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే చెప్పాలి. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో చెప్పకర్లేదు. ఇక చిరు భార్య సురేఖ కూడా నాగబాబు, పవన్ కళ్యాణ్ విషయంలో తల్లిలాగా వ్యవహరిస్తుంది. కానీ ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు విభేదాలు వస్తుంటాయి. అలా చిరు, నాగబాబు మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు సురేఖ ఎలా ప్రవర్తిస్తుందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాగబాబు.

‘నాకు, అన్నయ్యకు అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు వచ్చినా నా మాట అన్నయ్య వింటాడు. అన్నయ్య మాట నేను వింటాను. కానీ మా ఇద్దరి మధ్య వాదనలో తేడా వచ్చినప్పుడు మా వదిన మధ్యలో వచ్చేస్తుంది. అన్నయ్య నన్ను ఏదైనా అంటే చాలు వెంటనే నా తరఫున నిలబడుతుంది. అన్నయ్యకు సర్ది చెప్తుంది. మా వదినకి నేనంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను బాగా నవ్విస్తుంటాను. అందుకే ఇంట్లో నాగబాబు ఉంటే కలగా ఉంటుంది అంటుంటుంది’ అని నాగబాబు పేర్కొన్నాడు. ప్రజంట్ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story