- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశలన్నీ ఆ రెండు సినిమాలపైనే పెట్టుకున్న నభా.. ఈసారైనా అదృష్టం కలిసొచ్చేనా?
ఆ సినిమాలు విడుదలకు ముందే నభా సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేసింది.

దిశ, సినిమా: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోయిన్ నభా నటేష్(Nabha Natesh) ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించుకున్న ఈ భామ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్లు అందుకోలేకపోయింది. 2024లో వచ్చిన ‘డార్లింగ్’ సినిమా కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. దానికి తోడు ఒక ప్రమాదానికి గురై, సుమారు ఏడాది పాటు సినిమాలకు దూరం కావాల్సి రావడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపింది. అయితే, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో, రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం నభా నటేష్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘స్వయంభు’, కాగా మరొకటి పీరియాడికల్ థ్రిల్లర్ ‘నాగబంధం’.
ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ‘స్వయంభు’లో నభా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక ‘నాగబంధం’ కోసం ఆమె ఏకంగా యుద్ధ విద్యలు, కత్తి సాము వంటివి కూడా నేర్చుకోవడం విశేషం. ఈ సినిమాల కోసం ఆమె పడుతున్న కష్టం చూస్తుంటే, ఎలాగైనా సరే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. సినిమాలు విడుదలకు ముందే నభా సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేసింది. తన సినిమా పాత్రల గెటప్‌లలో ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతోంది. సమ్మర్ కానుకగా ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకవేళ అమ్మడు అదృష్టం కలిసొచ్చి ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా, నభా కెరీర్ మళ్ళీ స్పీడ్ అందుకోవడం ఖాయం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకుని, తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ఈ సమ్మర్ సీజన్ నభాకు అత్యంత కీలకం కానుంది.






