- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఊహించినంత సులభంగా నా పెళ్లి జరగలేదు.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
నేను ఎప్పుడూ నా పెళ్లి చాలా నిశ్శబ్దంగా, కేవలం ఒక గుసగుసలాగా ఉండాలని ఊహించుకున్నాను.

దిశ, సినిమా: బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం తన వివాహ బంధంపై పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మను మార్చి 21న వివాహం చేసుకున్న ఈ బ్యూటీ, పెళ్లి అంటే కేవలం ఒక ఆర్భాటం కాదని, అది ఒక అంతర్గత ప్రయాణమని తన పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. "నేను ఎప్పుడూ నా పెళ్లి చాలా నిశ్శబ్దంగా, కేవలం ఒక గుసగుసలాగా ఉండాలని ఊహించుకున్నాను. కానీ ప్రేమ ఒక్కటే రాలేదు, అది తనతో పాటు కుటుంబాలను, వారి ఆచారాలను, అంచనాలను కూడా తీసుకువచ్చింది. వాటన్నిటి మధ్య నా నిరాడంబరత ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది. నేను ఊహించినంత సులభంగా నా పెళ్లి జరగలేదు." అని పేర్కొంది. ఇది ప్రపంచం చూసేందుకు చేసే ప్రదర్శన కాదని, తనలోని పవిత్రమైన స్త్రీపురుషుల కలయిక అని ఆమె తెలిపింది. పెళ్లి హడావిడిలో తన స్వరం కంటే బయటి శబ్దాలే ఎక్కువగా వినిపించిన క్షణాలు ఉన్నాయని, కానీ తన భర్తను చూడగానే ఆ గందరగోళం అంతా మసకబారిపోయిందని పునర్నవి ఎమోషనల్ అయ్యింది.
"నేను ఇది చేయగలను.. నేను అతన్ని ఎంచుకుంటున్నాను అని నాకు నేను చెప్పుకోవడానికి ఆ ప్రశాంతత సరిపోయింది. కలిసి ఉంటూనే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి, ఒకరి ఎదుగుదలకు మరొకరం తోడుండడానికి ఈ పెళ్లి ఒక వేదిక కావాలని కోరుకున్నాను" అని ఆమె రాసుకొచ్చింది. లోకం సాక్ష్యంగా ఉండాలని తాను పెళ్లి చేసుకోలేదని, ఆ బరువును ,తేలికదనాన్ని రెండింటినీ భరించడానికి తాను సిద్ధంగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని పునర్నవి స్పష్టం చేసింది. "ఇది నేను ఊహించినంత సులభమైన పెళ్లి కాదు, కానీ అది నిజాయితీగా, మనసు పెట్టి జరిగింది. అది మాది.. మాకు అది చాలు" అని అన్నారు. తన పెళ్లిని ఎంతో అందంగా చిత్రీకరించిన స్నేహితుడికి ధన్యవాదాలు తెలుపుతూ ఫోటోలను షేర్ చేసింది.






