‘నా శృంగార ఆలోచన తనను ప్రశాంతంగా తిననివ్వదు’.. ఇలియానా పోస్ట్.. పుట్టబోయే బిడ్డకు తండ్రి అతడేనా?

by Disha Web Desk 6 |
‘నా శృంగార ఆలోచన తనను ప్రశాంతంగా తిననివ్వదు’.. ఇలియానా పోస్ట్.. పుట్టబోయే బిడ్డకు తండ్రి అతడేనా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా దేవదాసు, పోకిరి వంటి చిత్రాలతో ఊహించని క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్టార్ హీరోల చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు అదే జోరును కొనసాగించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. అయితే ఇటీవల పెళ్లి కాకుండానే తాను ప్రెగ్నెంట్ అంటూ ఓ పోస్ట్‌తో షాకిచ్చిన సంగతి తెలసిందే. దీంతో అది చూసిన నెటిజన్లు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని? కామెంట్లు చేస్తూ రచ్చ చేశారు. అయినా ఈ అమ్మడు స్పందించకుండా తరచూ సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. అందులో తన ప్రియుడి చేతిలో చెయ్యేసి ఉంచి ‘‘ నా శృంగార ఆలోచన తనను ప్రశాంతంగా తిననివ్వదు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో ఇద్దిరి చేతులకు రింగులు ధరించి ఉండడాన్ని చూస్తే వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్ ఫొటోలను షేర్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి అతనేనని అందరూ భావిస్తున్నారు.

Also Read.: బికినీలో రెచ్చగొడుతున్న రకుల్.. ఎల్లో మామిడి పండ్లు అంటున్న నెటిజన్లు





Next Story

Most Viewed