నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది.. ఇందులో నా విశ్వరూపం చూస్తారు: కయ్యదు లోహర్

by Mallepaka Hamsa |

సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా, భిన్నంగా ఉంటుంది. గతంలో నేను చేసిన 'పల్లిచట్టంబి' చిత్రానికి ఇది పూర్తి భిన్నమైనది.

నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది.. ఇందులో నా విశ్వరూపం చూస్తారు: కయ్యదు లోహర్
X

దిశ, సినిమా: కన్నడ ముద్దుగుమ్మ కయ్యదు లోహర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. గత ఏడాది విడుదలైన ‘డ్రాగన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ క్రేజీ అవకాశాలను దక్కించుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ‘ఐయామ్ గేమ్’ అనే పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌లో కయ్యదు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను దుల్కర్ తన సొంత నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం. ‘ఆర్డీఎక్స్’ వంటి భారీ హిట్‌ను అందించిన నహస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూదం నేపథ్యంతో సాగే ఒక ఉత్సాహభరితమైన కథతో రూపొందుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కయ్యదు లోహర్ తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. "ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా, భిన్నంగా ఉంటుంది. గతంలో నేను చేసిన 'పల్లిచట్టంబి' చిత్రానికి ఇది పూర్తి భిన్నమైనది. అందుకే ఈ సినిమా కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు నన్ను రెండు వేర్వేరు రూపాల్లో, విభిన్న కోణాల్లో చూస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలో నా విశ్వరూపం చూపించబోతున్నారు డైరెక్టర్" అంటూ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. కేవలం దుల్కర్ మూవీనే కాకుండా, కయ్యదు ఖాతాలో మరికొన్ని భారీ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా.. ‘‘ఐయామ్ గేమ్’ చిత్రంలో కతీర్, సంయుక్త విశ్వనాథన్, మిస్కిన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఈ చిత్రం 2026 ఓనం పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story