- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా వల్లే ప్రగతికి పతకాలు వచ్చాయి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వేణు స్వామి
సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా వేణు స్వామి(Venu Swamy) హీరోయిన్లతో పలు ప్రత్యేక పూజలు కూడా చేయించాడు.

దిశ, సినిమా: సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా వేణు స్వామి హీరోయిన్లతో పలు ప్రత్యేక పూజలు కూడా చేయించాడు. ఆయనతో ఎంతోమంది సీక్రెట్‌గా పూజలు చేయించుకోవడంతో.. ఆ వీడియోలను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేసి పాపులారిటీ మరింత పెంచుకున్నాడు. ఆయన చేసిన పూజల వల్ల స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈక్రమంలోనే.. వేణు స్వామి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆయన మాత్రం పూజలు ఆపడం లేదు. సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటారని చెప్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. పలు చానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ నమ్మలేని నిజాలు బయటపెడుతున్నాడు. ఇటీవల నాగచైతన్య, శోభిత విడిపోతారని చెప్పడంతో వివాదాస్పదమయ్యాయి. దీనిపై పెద్ద ఇష్యూనే జరిగింది. కేసు వరకు వెళ్లడంతో.. వేణు స్వామి ఇకనుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
తాజాగా, మరోసారి వేణు స్వామి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. నటి ప్రగతి మెడల్ సాధించడంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ప్రగతి వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించిన నాలుగు పతకాలు తన పూజల వల్ల వచ్చాయని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘‘మనిషి ఒక విధంగా సక్సెస్ అవుతుంటే విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. నా దగ్గరికి వచ్చిన సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో పూజలు చేయించుకుంటున్నారు. ఇటీవల మెడల్ సాధించిన ప్రగతి కూడా నాతో పూజలు చేయించుకుంది. సినిమాల గురించి కాకుండా ఆమె రెజ్లింగ్‌పై గెలవాలని పూజలు చేయించింది. ఆ పూజ వల్లే ఆమె మెడల్స్ సాధించింది’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలాగే ఇదే ఇంటర్వ్యూలో ఒక్క పూజకి లక్షల్లో తీసుకుంటారని వార్తలు వస్తున్నాయని యాంకర్ అడగ్గా.. దీనికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘అన్ని లక్షలు నాకిస్తే ఇంకేమీ నేను ఎన్నో చేసే వాడిని కదా. అలా పూజలు చేయించుకునే వాళ్లు ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి’’ అని వెటకారంగా చెప్పారు. అయితే పూజకి ఎంత తీసుకుంటాడనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో లక్షల్లో తీసుకుంటాడు కాబట్టే సెలబ్రిటీల జాతకాలు చెప్తూ.. పూజలు చేస్తున్నాడని అందుకే సమాధానం కరెక్ట్‌గా చెప్పలేదని అంటున్నారు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.






