‘భగవంత్ కేసరి’ కాదు.. నా అసలు రీఎంట్రీ సినిమాలు ఆ రెండే: కాజల్

by Disha Web Desk 7 |
‘భగవంత్ కేసరి’ కాదు.. నా అసలు రీఎంట్రీ సినిమాలు ఆ రెండే: కాజల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక కాస్త విరామం తర్వాత.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసిన కాజల్ ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ, కాజల్ పోషించిన కాత్యాయణి పాత్రకు మాత్రం అంత రెస్పాన్స్ దక్కలేదు. దీంతో కాజల్ రీఎంట్రీ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ ఇది కాస్త నిరుత్సాహ పరిచినట్లుయింది. అయితే.. తన అసలు రీఎంట్రీ ఇది కాదంటోంది కాజల్. ఆ విషయాల్లోకి వెళితే..

‘పెళ్లి తర్వాత భారతీయుడు-2 తో పాటు మహిళ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ సినిమా కూడా ఒప్పుకున్నాను. సత్యభామ కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, భారతీయుడు-2 కోసం కలరిపయట్టు అనే మరో యుద్ధ రీతిని కూడా నేర్చుకున్న. ఈ రెండు నేర్చుకోవడం కోసం 3 నెలల టైం పట్టింది. శారీరకంగా చాలా కష్టపడ్డాను. ఈ సినిమాల షూటింగ్స్ సమయంలో చాలా తృప్తిగా అని పించింది. కెరీర్‌లో తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. ఈ రెండు సినిమాలో నా అసలైన రీ ఎంట్రీ మూవీస్’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్.

Read More..

స్టేట్ బడ్జెట్‌లో 60 శాతం KCR ఫ్యామిలీ చేతుల్లోనే: మానిక్ రావ్ థాక్రే

Next Story