నా భర్త విషయంలో మా అమ్మ మాట నిజమైంది.. నటి పూర్ణ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నటి పూర్ణ (Poorna)అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

నా భర్త విషయంలో మా అమ్మ మాట నిజమైంది.. నటి పూర్ణ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: నటి పూర్ణ (Poorna)అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ‘అఖండ’(Akhanda)లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ సాధించి తన పాపులారిటీని పెంచుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొవైపు డ్యాన్స్ షోలకు జడ్డిగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. 2022లో అక్టోబర్‌లో దుబాయ్‌కి చెందిన జేబిఎస్ గ్రూప్ ఫౌండర్ షనిద్ అసిఫ్ ఆలీని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పూర్ణ మళ్ళీ ‘గుంటూరు కారం’ మూవీలో కుర్చీ మడతపెట్టి సాంగ్‌తో రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది.

ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న పూర్ణ రియాలిటీ షోస్‌లో పాల్గొంటుంది. తాజాగా, పూర్ణ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇవ్వడంతో తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘‘మా అమ్మ కృషి, ప్రోత్సాహం వల్లే నేను డ్యాన్సర్‌గా మారాను. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మా అమ్మ లాగా నా నృత్యానికి మద్దతు ఇచ్చే పార్ట్‌నర్ ఇవ్వాలని దేవుడిని కోరుకున్నాను. నువ్వు కోరుకున్న కలలు నెరవేరేలా చూసే వ్యక్తి నీకు భర్తగా రావాలి అని మా అమ్మ నన్ను ఆశీర్వదించింది.

అటు అమ్మ కల, ఇటు నా కల భగవంతుడు నిజం చేశాడు. నా భర్త సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా నృత్యానికి సపోర్ట్‌గా నిలిచారు. కులం, నేపథ్యం తేడాలు పట్టించుకోకుండా ఒక మనిషిగా, ప్రేమ, గౌరవం చూపించే ఆయన మంచి మనసుకు నేను ధన్యురాలిని’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు పూర్ణ భర్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పర్ఫార్మెన్స్‌లు ఇంకా చాలా చేయాలని కామెంట్లు పెడుతున్నారు.

Next Story