నా తల్లే డబ్బులు తీసుకుని నన్ను మగాడి గదిలోకి పంపేది.. నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
నా తల్లే డబ్బులు తీసుకుని నన్ను మగాడి గదిలోకి పంపేది.. నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి షకిలా సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె పేరు టైటిల్‌లో ఉంటేనే ఒకప్పుడు బాక్సాఫీసు బద్దలు అయ్యేది. అయితే షకిలా ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. ఇటీవల బిగ్‌బాస్ షోతో అందరినీ అలరించింది. అలాగే కొన్ని టెలివిజన్ షోస్‌లోనూ కనిపిస్తుంది. ఆమెకు వచ్చిన సంపాదనలో కొంత వరకు సామాజిక సేవా రంగంలో ఖర్చు చేస్తుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకిలా ఎమోషనల్ కామెంట్స్ చేసింది.నేను చిన్న వయసులోనే బలంగా కనిపించేదానిని.. నా వయసు కన్నా మించి నా హైట్ ఉండేది. అలాగే నేను హైస్కూల్ లో చదువుతున్నప్పుడే కాలేజీ అమ్మాయిలా ఉండేదాన్ని.. దారిలో నన్ను చాలా మంది ఓ రకంగా చూసేవారు. అలా ఎందుకు చూస్తున్నారని అర్థం కాలేదు. మా ఇంట్లో ఎప్పుడు డబ్బే పెద్ద సమస్యగా ఉండేది. దీంతో మా అమ్మ మగవాళ్లను పరిచయం చేసి వాళ్ల గదికి వెళ్లమని చెప్పేది. అందుకు నేను ఒప్పుకునే దాన్ని కాదు.. అందువలన అమ్మ ఆ విషయంలో బాగా కొట్టేది. దీంతో నాకు వేరే మార్గం లేక.. నోరు మూసుకుని అమ్మ చెప్పినట్లు ఉండేదాన్ని. మా అమ్మమ్మ, అమ్మ కూడా ఈ విధంగా చాలా డబ్బు సంపాదించారు. నన్ను అదే దారిలో వెళ్లమన్నారు. కానీ నేను సినిమాలు ఎంపిక చేసుకున్నాను. కానీ ఇక్కడ కూడా నా శరీరం కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉంచేవారు. అందుకు నాకు చాలా బాధగా ఉండేది. ఆర్టిస్ట్‌గా ఉండే అర్హతలు నాకు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కోరుకోలేదు. కెమెరా ముందు నన్ను కీలుబొమ్మలా వాడుకున్నారు’’ అని చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed