ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నాకు అది ఎప్పటికీ ప్రత్యేకమే: రుక్మిణి వసంత్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-01 16:11:18  IST  )

కన్నడ యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) అందరికీ సుపరిచితమే. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నాకు అది ఎప్పటికీ ప్రత్యేకమే: రుక్మిణి వసంత్
X

దిశ, సినిమా: కన్నడ యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) అందరికీ సుపరిచితమే. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రుక్మిణికి ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఇక అప్పటినుంచి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతుంది. అలాగే కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్-1’లో నటిస్తోంది. త్వరలోనే రుక్మిణి వసంత్ ‘మదరాసి’ (Madharaasi)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్(Siva Karthikeyan) హీరోగా నటిస్తుండగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతుండగా.. విద్యుత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న రుక్మిణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘నాకు సినీ ఇండస్ట్రీలో నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన మూవీ ‘సప్త సాగరాలు దాటి’ దాని గురించి మాట్లాడకుండా మరో సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకునే స్థాయికి నేను చేరుకోలేదనుకుంటున్నాను.

ఇండస్ట్రీలో నాకు రెండో జీవితాన్ని ఇచ్చిన చిత్రాన్ని ఎలా మర్చిపోగలను. 2019లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో నేను ఇండస్ట్రీలో రాణిస్తానా.. అసలు సినిమాలకు పనికొస్తానా లేదా వేరే ఏదైనా ఉగ్యోదం చేసుకోవాలా? అని నాలో నేను చాలా కంగారు పడ్డాను. ఆ సమయంలోనే ‘సప్త సాగరాలు దాటి’ మూవీ వచ్చింది. ఆ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. మంచి గుర్తింపు లభించడంతో పాటు.. వరుస అవకాశాలు వచ్చాయి. చాలామంది అభిమానులను సొంతం చేసుకోగలిగాను. అందుకే ఆ సినిమా నాకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే’’ అని చెప్పుకొచ్చింది.

Next Story