- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనతో నా ప్రయాణం అందంగా ఉంటుంది.. మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). ఇందులో మాళవిక మోహనన్ ( Malavika Mohanan )హీరోయిన్‌గా నటిస్తుండగా.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. షూటింగ్ కంప్లీట్ కాకపోవడం వల్ల విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా డిసెంబర్ 5న రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం డార్లింగ్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ప్రభాస్ చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన వయసులో నాకంటే పెద్దవాడు. కానీ ప్రభాస్‌ను చూసినప్పుడు అలా అనిపించదు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మధురంగా అనిపించింది. ‘ది రాజాసాబ్’లో మా ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. నిజానికి మేము సినిమాను పూర్తి చేశాము. ప్రస్తుతం కొన్ని పాటలను చిత్రీకరించాల్సి ఉంది. మీ అందరినీ అలరించేందుకు మా సినిమా సిద్ధంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.






