- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాన్ని చూపించాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆ వివాదంపై స్పందించిన అనుపర్ణ
బాలీవుడ్ దర్శకురాలు అనుపర్ణ రాయ్(Anuparna Roy) ఇటీవల 82వ వెనిస్ ఫిలిమ్ ఫెస్టివల్(Venice Film Festival) వేడుకల్లో పాల్గొంది.

దిశ, సినిమా: బాలీవుడ్ దర్శకురాలు అనుపర్ణ రాయ్(Anuparna Roy) ఇటీవల 82వ వెనిస్ ఫిలిమ్ ఫెస్టివల్(Venice Film Festival) వేడుకల్లో పాల్గొంది. ఇందులో ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ పాటకు అవార్డు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ క్రమంలోనే అనుపర్ణ పలు వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. పాలస్తీనాపై సంచలన స్టేట్‌మెంట్ చేసింది. దీంతో గత కొద్ది రోజులపై అనుపర్ణను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా, ఓ ఇంటర్వ్యైలో పాల్గొన్న అనుపర్ణ పాలస్తీనా విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘‘కొంతమంది నా మాటలు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నేను పాలస్తీనా గురించి మాట్లాడుతున్నానంటే నేను భారతీయురాలిని కాదని అనుకోకండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతు అన్యాయన్ని ఎత్తి చూపాలన్న ఉద్దేశ్యంతోనే నేను అలా మాట్లాడాను.
దేశంలోనో, నేపాల్‌లోనో లేదా మరెక్కడైనా జరుగుతున్న మారణహోమాలపై కూడా నేను స్పందిస్తుంటాను. ఇదే మొదటిసారి కాదు. భారతదేశం సాధించిన విజయాన్ని మీరు సెలబ్రేట్ చేయలేకపోయినా పర్లేదు కానీ చెడుగా రాజకీయం చేయకండి. నేను అసలు రాజకీయవేత్తను కాదు. ఎలాంటి రాజకీయ పార్టీకీ నేను ప్రాతినిధ్యం వహించను. అనురాగ్ కశ్యప్ ఇప్పటి వరకు కలిసి అత్యంత మధురమైన వ్యక్తి. నన్ను పాలస్తీనా గురించి మాట్లాడవద్దని సలహా ఇచ్చారు. కానీ నేను పట్టించుకోలేదు. నన్ను వామపక్షవాదిని అని అనురాగ్ ప్రభావంతోనే మాట్లాడుతున్నాని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం అందులో ఎలాంటి నిజం లేదు. నేను చెప్పింది నిజం. నా గురించి వచ్చే విమర్శల వల్ల నాకు బాధలేదు. కానీ తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.






