- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. నేను భరించలేకపోతున్నానంటూ పవన్ భార్య సంచలన పోస్ట్
భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్(Pawan Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్(Pawan Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లోనే రాణిస్తున్నాడు. ఇక ఇటీవల స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే.. హీరోయిన్ అంజలి రాఘవ్‌ను అసభ్యకరంగా తాకి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆమె భోజ్‌పురి ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో తప్పు చేసినట్లు పవన్ క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే..తాజాగా, పవన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భార్య జ్యోతి సింగ్ పలు ఆరోపణలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన వీడియో షేర్ చేసింది. తన భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని హోటల్‌కు వెళ్తున్నాడని తన ఇంటికి వెళ్తే తనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు తెలుపుతూ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
‘‘నా భర్త పవన్ సింగ్ భార్యను బయటకు గెంటేయాలని పోలీసులను పిలిపించుకున్నారు. అలాంటి వ్యక్తి సమాజానికి సేవ చేస్తాడా?. ఎన్నికల సమయంలో నా పేరును ఉపయోగించుకుని.. అవి అయిపోగానే మరొక అమ్మాయితో ఎంజాయ్ చేయడానికి హోటల్‌కు వెళ్లాడు. కానీ నన్ను మాత్రం భర్త ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని చాలామంది అడుగుతున్నారు. అతని తప్పులను ప్రశ్నించకుండా నన్ను నిందిస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పవన్ మాత్రం నా ముందే వేరే అమ్మాయితో తిరుగుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను’’ అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కాగా, పవన్ సింగ్, జ్యోతి సింగ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే పవన్ 2014లో ప్రియ కుమారిని పెళ్లాడగా.. ఏడాదికే విడిపోయారు. ఇక ఆ తర్వాత జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది రోజులకే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. విడాకులు మంజూరు అయ్యాయా లేదా అన్నది వెల్లడించనప్పటికీ వీరిద్దరు మాత్రం దూరంగా ఉంటున్నారు.
Read More..
VIRAL VIDEO: అది మెట్రో అనుకున్నారా.. ఓయో అనుకున్నారా.. ఇంత కరువులో ఉన్నారేంట్రా?






