మూడేళ్ల నుంచి ఆ విషయంలో నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు.. అందుకే కీలక నిర్ణయం తీసుకున్నా: జెనీలియా

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్ జెనీలియా(Genelia) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మూడేళ్ల నుంచి ఆ విషయంలో నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు.. అందుకే కీలక నిర్ణయం తీసుకున్నా: జెనీలియా
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ జెనీలియా(Genelia) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాయ్స్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి బొమ్మరిల్లు, సై, హ్యాపీ, రెడీ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యా్క్ హిట్స్ సాధించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు మూవీలో హాసిని క్యారెక్టర్‌లో నటించి తింగరిగా ప్రవర్తించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగు, తమిళ స్టార్స్ రామ్ చరణ్, దళపతి విజయ్, ఎన్టీఆర్, వెంకటేష్, ధనుష్ వంటి హీరోలతో నటించిన ఈ భామ ఎన్నో విజయాలు సాధించింది. అంతేకాకుండా పలు హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మళ్లీ పదేళ్ల తర్వాత జెనీలియా ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగులో కిరీటి రెడ్డి(Kireeti Reddy), శ్రీలీల (sreeleela) కాంబోలో వచ్చిన ‘జూనియర్’ మూవీతో 13ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నేడు ఘనంగా విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను రీ ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు కాదు 2022లోనే నా భర్త దర్శకత్వంలో వచ్చిన మజిలీ మరాఠీ రీమేక్‌లో సమంత పాత్రను చేశాను. కానీ ఇప్పుడు దీనిని ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ రీ ఎంట్రీ అనవచ్చు. సినిమాలు జీవితంలో ముఖ్యమైనవే.. కానీ కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఈ 13 ఏళ్లలో నా భర్త, పిల్లలతో సంపూర్ణమైన జీవితం గడిపాను. ఇప్పుడు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారు కాబట్టి మళ్లీ కెమెరా ముందుకు రావాలనిపించింది.

దీనంతటికి కారణం నా భర్త రితేష్ దేశ్‌ముఖ్. మూడేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వమని నన్ను టార్చర్ చేస్తున్నాడు. అందుకే నేను ‘జూనియర్’ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను. నన్ను జెనీలియా’గా కాకుండా ‘హాసినిగా’ గుర్తుపెట్టుకున్నారు. తెలుగులో మళ్లీ తిరిగి నటించాలని ఉంది. అలాగే నాతో పాటు చేసిన హీరోలందరూ ఇప్పుడు మంచి రేంజ్ లో ఉన్నందుకు ఆనందంగా ఉంది. నేను పదేళ్లుగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ఓ కంపెనీ కూడా రన్ చేస్తున్నాను. 13 ఏళ్ల తర్వాత ‘జూనియర్’ సినిమాను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం చాలా పవర్ ఫుల్ రోల్ కాబట్టి నటించాను. అయితే నేను అన్ని రకాల పాత్రలు చేస్తానని చెప్తే అవకాశాలు రావు. నీ టాలెంట్‌ను బట్టి చాన్సులు వస్తాయి. నాకూడా ఈ మూవీ టీమ్ నాకు స్పెషల్ రోల్ ఇచ్చారు. ఆ పాత్రలో నటించినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు జెనీలియా భర్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి తర్వాత హీరోయిన్స్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం కష్టం. అలాంటిది భార్య ఇంట్రెస్ట్‌ను గుర్తించి సపోర్ట్ చేయడం గ్రేట్ అని అంటున్నారు.

Next Story