కాబోయే భార్యకు ఇలాంటి లక్షణాలుండాలి: Sudigali Sudheer

by Vinod kumar |   (  Updated:2023-08-29 13:00:28  IST  )

బుల్లితెర ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు.

కాబోయే భార్యకు ఇలాంటి లక్షణాలుండాలి: Sudigali Sudheer
X

దిశ, సినిమా: బుల్లితెర ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలు చేసి ఇప్పుడు పలు సినిమాల్లో బిజీ అయిపోయాడు. ఇకపోతే సుధీర్ పెళ్లి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే పేరు రష్మి. వీరిద్దరికి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్‌ను ‘మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి’ అని ప్రశ్నించగా ‘పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే కాబోయే భార్యలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పగలను. కానీ నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. నిజంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాలా కూల్‌గా హ్యాపీగా నవ్వుతూ ఉండే అమ్మాయి దొరికితే చాలు. మరేమీ అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: Allu Arjun: జాతీయ అవార్డుతో అల్లు అర్జున్‌కు పెరిగిన పారితోషికం!

Next Story