ఈ ప్రపంచానికి మీలాంటి వాళ్లే కావాలి: హృతిక్ ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 13 |
ఈ ప్రపంచానికి మీలాంటి వాళ్లే కావాలి: హృతిక్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన ఫిట్‌నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అప్ కమింగ్ మూవీ ‘ఫైటర్’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న హృతిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేస్తూ క్రిస్‌ను పొగిడేశాడు. ‘నా స్నేహితుడు, శిక్షకుడు క్రిస్ గెతిన్ తన ఇంటికి (US టామ్‌) తిరిగి వెళుతున్నాడు. ‘ఫైటర్’ సినిమా కోసం నాకు ఇచ్చిన శిక్షణతోపాటు అతనికి పనిపై ఉన్న నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయాను.

ఈ ప్రపంచానికి మీలాంటి మనుషులు కావాలి. కానీ, మన రెండవ దశ ట్రైనింగ్‌కు ఇంకా 10 వారాలు మిగిలి ఉన్నందున్న మీరు మధ్యలోనే వెళ్లి పోతుండటంతో సంతృప్తి చెందలేకపోతున్నా. మీ కోసం ఎల్లప్పుడూ ఎదురుచూస్తుంటాను’ అంటూ తమ మధ్యనున్న బాండింగ్ గురించి వివరించాడు హృతిక్. ప్రస్తుతం ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుండగా గురుశిష్యుల కటౌట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Next Story

Most Viewed