- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను హీరోయిన్ కావడానికి కారణం ఆయనే.. కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్!
హీరోయిన్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందరికీ ఒకేలాంటి అవకాశం రాదు.

దిశ, సినిమా: హీరోయిన్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందరికీ ఒకేలాంటి అవకాశం రాదు. కొంతమంది ఎన్నో ఆడిషన్లు ఇచ్చినప్పటికీ సెలెక్ట్ అయ్యే అదృష్టం ఉండదు. కానీ కొందరికి మాత్రమే అనుకోని విధంగా అదృష్టం కలిసివస్తుంది. ఊహించని విధంగా హీరోయిన్‌గా చాన్స్ దక్కించుకుని ఇండస్ట్రీలో రాణిస్తుంటారు. ఇక టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Kriti Shetty)కి కూడా అలాగే హీరోయిన్‌గా చాన్స్ వచ్చిందట. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి ఈ విషయాన్ని తెలిపింది. ‘‘నేను మొదట ఒక యాడ్ కోసం అడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను. అడిషన్ పూర్తయ్యాక నన్ను తీసుకెళ్లడానికి మా నాన్న వస్తా అన్నాడు. కానీ, ఆయన రావడం కాస్త ఆలస్యం అయ్యింది. దాంతో నేను పక్కనే ఉన్న స్టూడియోకి వెళ్లాను. అక్కడ ఓ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈ విషయం నాకు తెలియదు ఏం జరుగుతుందో చూడటానికి వెళ్లాను.
కానీ అక్కడ ఉన్న వాళ్ళు నన్ను చూసి నా దగ్గరకు వచ్చి మీకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. వారికి ఎం చెప్పాలో తెలియక మా అమ్మ నంబర్ ఇచ్చి వచ్చాను. కొన్ని రోజుల తరువాత వాళ్ళు అమ్మకి కాల్ చేయడం.. సినిమాలో ఒకే అవడం చకా చకా జరిగిపోయాయి. అలా బుచ్చిబాబు గారు చేసిన ఉప్పెన సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యాను. అది అనుకోకుండా చేసిన మూవీ. కానీ చాలా స్పెషల్” అని చెప్పుకొచ్చింది. కాగా.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక మొదటి ప్రాజెక్ట్‌తో హిట్ అందుకున్న కృతికి ఆ తర్వాత పెద్దగా కలిసి రాలేదు. ఆమె చేసిన సినిమాలన్ని ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసిన ఈ భామ అక్కడ వరుస ప్రాజెక్ట్స్‌లో అవకాశం దక్కించుకుంటుంది. ప్రస్తుతం వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు ప్రాజెక్ట్స్ త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. తెలుగు సినిమాల విషయానికొస్తే.. వరుస ఫ్లాప్‌లు తన ఖాతాలో వేసుకోవడంతో కృతికి అవకాశాలు ఇవ్వాలంటూ దర్శకనిర్మాతలు కాస్త భయపడుతున్నారు.






