- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కల నెరవెరబోతోంది.. ఈ ప్రాజెక్ట్ సవాలుతో కూడుకున్నది: పార్వతి తిరువోతు
మలయాళ బ్యూటీ పార్వతి తిరువోతు(Parvati Thiruvothu) స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫేమ్ సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ పార్వతి తిరువోతు(Parvati Thiruvothu) స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫేమ్ సొంతం చేసుకుంది. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. గత ఏడాది ‘తంగలాన్’ చిత్రంతో పార్వతి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క సినిమాతోనే అమ్మడు ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ తార డాన్ పలతర (Dan Palatara)దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇందులో మలయాళ నటుడు దిలీష్ పోతన్ (Dileesh Pothan)సరసన పార్వతీ నటించనుంది.
ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ‘‘డాన్ పలతర సినిమాలు సహజంగా ఉండేలా తెరకెక్కిస్తారు. ఆ రకమైన ప్రపంచంలోకి అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అతని సినిమాలు శక్తివంతమైన ధ్యాన గుణాన్ని కలిగి ఉంటాయి. ఇందులో చురుకుగా పాల్గొనమని ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు. ఇందుకు నేను ఉల్లాసంగా భావిస్తున్నాను.. ఎందుకంటే సెట్‌లో కంఫర్ట్‌గా నటించే అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా సవాలుతో కూడుకున్నది. అతనితో పనిచేయడం కొంతకాలంగా నా కోరికల జాబితాలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో నా కల నెరవేరబోతోంది. నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను సంవత్సరాలుగా ఆరాధించే సృజనాత్మక సున్నితత్వాన్ని ఆరాధించే దిలీష్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం మాటల్లో చెప్పలేను. మళ్ళీ ఆయనకు విద్యార్థిగా ఉండటానికి అవకాశం వచ్చినట్లుగా అనిపిస్తుంది’’ అని చెప్పింది.






