చెదిరిన చోటే మళ్లీ మొదలైన కల.. నమ్మలేకపోతున్నానంటూ రియా ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-05 16:00:41  IST  )

బాలీవుడ్ వివాదాస్పద బ్యూటీ రియా చక్రవర్తి (Rhea Chakraborty)మళ్ళీ కెమెరా ముందుకు వస్తోంది.

చెదిరిన చోటే మళ్లీ మొదలైన కల.. నమ్మలేకపోతున్నానంటూ రియా  ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ వివాదాస్పద బ్యూటీ రియా చక్రవర్తి (Rhea Chakraborty)మళ్ళీ కెమెరా ముందుకు వస్తోంది. గత ఏడేళ్లుగా సినిమాలకు, నటనకు దూరంగా ఉన్న ఈ భామ.. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మక షో ‘ఫ్యామిలీ బిజినెస్’ (Family Business) తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా .. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నటిగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ రియా షేర్ చేసిన వీడియోలో చాలా ఎమోషనల్ అయింది. ‘‘7 ఏళ్లు.. ఇది నిజంగా నమ్మలేనంత వింతగా ఉంది. నేను మళ్ళీ నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. 17 ఏళ్ల వయసులో ఏ కలలతో అయితే ముంబైకి వచ్చానో, మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆ కలకు బ్రేక్ పడింది. పని దొరకడం ఆగిపోయింది. కల చెదిరిన చోటే ఇప్పుడు మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టడం ఒక కల నిజమైనట్లుగా ఉంది’’ అని రియా చెప్పుకొచ్చింది.

రియా చక్రవర్తి తన మేకప్ రూమ్ లో సిద్ధమవుతున్న ఈ వీడియో చూసి ఆమె అభిమానులు ‘‘వెల్కమ్ బ్యాక్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వివాదాల తర్వాత ఆమె చేస్తున్న మొదటి పెద్ద ప్రాజెక్ట్ కావడంతో 'ఫ్యామిలీ బిజినెస్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. చివరిసారిగా 2019లో అమితాబ్ బచ్చన్ సినిమా ‘చెహ్రే’ కోసం షూటింగ్‌లో పాల్గొన్న రియా, ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాతి పరిణామాలతో తీవ్ర విమర్శలు, విచారణలు ఎదుర్కొంది. ఆ వివాదాల వల్ల ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ, తన పట్టుదలతో మళ్ళీ ఇప్పుడు ‘చాప్టర్ 2’ మొదలుపెడుతున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘‘మనం భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు.. లైఫ్ మన కోసం వేరే ప్లాన్స్ సిద్ధం చేస్తుంది’’ అంటూ తన ప్రస్తుత పరిస్థితిని వివరించింది. ప్రస్తుతం రియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More.. Mrunal Thakur: బేబీ బంప్‌తో దర్శనమిచ్చి షాకిచ్చిన మృణాల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు (వీడియో)

Next Story