Mrunal Thakur: బేబీ బంప్‌తో దర్శనమిచ్చి షాకిచ్చిన మృణాల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |

మృణాల్ ఠాకూర్ ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనం రేపాయి

Mrunal Thakur: బేబీ బంప్‌తో దర్శనమిచ్చి షాకిచ్చిన మృణాల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా, ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు ఒక్కసారిగా నెట్టింట సంచలనం రేపాయి. ఆమె బేబీ బంప్‌తో కనిపిస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో, నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెళ్లి కాకుండానే మృణాల్ గర్భవతి అయిందా? అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక వైరల్ అవుతున్న వీడియోలో మృణాల్ ఠాకూర్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి, స్పష్టంగా కనిపిస్తున్న బేబీ బంప్‌తో జాగ్రత్తగా నడుస్తోంది. ఆమె పక్కనే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఆమె చేయి పట్టుకుని సహాయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇక అది చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు షాక్‌కు గురై.. ఆమెకు ఎప్పుడు పెళ్లయింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెట్టడం గమనార్హం. ఈ వార్తలపై ఆందోళన చెందుతున్న అభిమానులకు అసలు విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మృణాల్ నిజంగా గర్భవతి కాలేదు. ఇది కేవలం ఒక సినిమా షూటింగ్ లోని సీన్ అని స్పష్టమైంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రం కోసం మృణాల్ ఈ ‘గర్భవతి’ గెటప్ వేసింది.

షూటింగ్ లో ఎవరో రహస్యంగా తీసిన ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో అది రూమర్లకు దారితీసింది. వరుణ్ ధావన్ - మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రంలో మృణాల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ఈ రొమాంటిక్-కామెడీ చిత్రంలో పూజా హెగ్డే, మౌనీ రాయ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రం2026 ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం.

Next Story