Shruti Hassan : పవన్ కళ్యాణ్‌ వల్లే నా కెరీర్ ఇలా ఉంది.. ఆయన రాజకీయంలో ఉంటే అదే జరుగుతుదంటూ శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు!

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-12 07:20:35  IST  )

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) తెలుగు, తమిళ, హిందీ బాషల్లో వరుస చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది.

Shruti Hassan : పవన్ కళ్యాణ్‌ వల్లే నా కెరీర్ ఇలా ఉంది.. ఆయన రాజకీయంలో ఉంటే అదే జరుగుతుదంటూ శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) తెలుగు, తమిళ, హిందీ బాషల్లో వరుస చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ‘ఓమై ఫ్రెండ్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రవితేజ, ఎన్టీఆర్, బాలకృష్ణ, ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు వంటి వారాతో నటించి తన పాపులారిటీ పెంచుకుంది. ఇటీవల ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ వయసుతో సంబంధం లేకుండా నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. త్వరలో ఈ అమ్మడు ‘కూలీ’(coolie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న ఈ మూవీకి లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ పవన్ కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నన్ను గబ్బర్ సింగ్ కోసం టీమ్ అడిగిన సమయంలో కొన్ని కారణాలు చెప్ప తిరస్కరించాను. కానీ హరీష్ శంకర్ మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. ఆ పాత్రలో మిమ్మల్ని మాత్రమే చూశాను తప్పకుండా చేయాలి అని విజ్ఞప్తి చేశారు. దీంతో కొన్ని వారా తర్వాత సినిమా కథ విని, స్టోరీ నచ్చడంతో చేయడానికి సిద్ధమయ్యాను. ఆ సినిమా చేయడం వల్ల ఈ రోజు నా కెరీర్ ఇలా ఉందని నమ్ముతున్నాను. ‘గబ్బర్‌సింగ్’ వల్ల నా జీవితం మారిపోయింది. తెలుగు సినిమా నాకు విజయానికి మొదటి నిలయాన్ని ఇచ్చింది.

దానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. హైదరబాద్‌తో నాకు చాలా కనెక్షన్ ఉంది. నా తండ్రికి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ పర్సన్, స్టార్డం ఎప్పుడు కూడా చూపించరు. గ్రామాలు, వ్యవసాయం గురించి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అలాంటి వ్యక్తి ఎక్కువగా రాజకీయాలలో ఉండాలి. ఆయన కచ్చితంగా రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్(Pawan Kalyan), తలపతి విజయ్(Thalapathy Vijay) సున్నిత మనస్కులు .. జెంటిల్ మెన్‌లా ఉంటారు’’ అని చెప్పకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

link

Next Story