- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘విశ్వంభర’ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఔట్.. బంపర్ ఆఫర్ అతనికే!
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఉన్న ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల నుండి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఒక కీలక పాత్రలో మెరవనుంది. అయితే, ఈ సినిమా నిర్మాణ దశ నుంచి విడుదల తేదీ వరకు వరుస మార్పులు జరుగుతుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఉండటంతో సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసినప్పటికీ, అది కూడా సాధ్యపడలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ విజువల్ వండర్‌ను జూలై నెలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. చిరంజీవి కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచేలా దర్శకుడు వశిష్ట ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 'విశ్వంభర' ప్రాజెక్టులో ఒక ఊహించని మార్పు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఉన్న ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల నుండి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో విశ్వంభర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను యంగ్ సంగీత దర్శకుడు హరి గౌరకు అప్పగించినట్లు తెలుస్తోంది.హనుమాన్, మిరాయ్సినిమాతో తన మ్యూజిక్ పవర్‌ను నిరూపించుకున్న హరి గౌరకు ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే అవకాశం రావడం ఆయన కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పటికే హరి గౌర విశ్వంభర ఆర్.ఆర్ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథకు హరి గౌర అందించే సంగీతం సరికొత్త ఊపునిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.






