Anirudh Ravichander: కావ్య మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్.. ట్వీట్ వైరల్.. బిగ్ షాక్‌లో నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-14 13:59:57  IST  )

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) అందరికీ సుపరిచితమే.

Anirudh Ravichander: కావ్య మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్.. ట్వీట్ వైరల్.. బిగ్ షాక్‌లో నెటిజన్లు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) అందరికీ సుపరిచితమే. ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా పలు పోస్టులు నెట్టింట చక్కరంలు కొడుతుండటంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. అయితే ఆయన పెళ్లి చేసుకోబోతుంది. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్‌(Kavya Maran)ను వివాహం చేసుకోబోతున్నట్లు టాక్. భారతీయ బిలియనీర్ మీడియా యజమాని. ఇక ఆమె తండ్రి కళానిధి మారన్ (Kalanidhi Maran)ఫుల్ రిచ్ అన్న విషయం తెలిసిందే. ఆయన భారతదేశంలోని అతిపెద్ద మీడియా సంస్థలలో ఒకటైన సన్ గ్రూప్ చైర్మన్. అంతేకాకుండా ఓ నిర్మాణ సంస్థకు యజమాని కూడా.

ఇక ఆయన కూతురిని అనిరుధ్ పెళ్లి చేసుకోబోతుండటంతో నెటిజన్లు ప్లాన్ అదిరిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం అవన్నీ పుకార్లు అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ విషయంపై అనిరుధ్ టీమ్ స్పందించి వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, అనిరుధ్ సినిమాల విషయానికొస్తే.. జైలర్, దేవర, జవాన్, 3 వంటి హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న ‘కూలీ’ మూవీకి తన మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే కింగ్‌డమ్, మదరాసి, లవ్ ఇన్సురెన్స్ వంటి చిత్రాలకు కూడా వర్క్ చేస్తున్నారు.

For link Twitter post

Next Story