ఓటీటీలోకి రాబోతున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 16:37:16  IST  )

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu), మంచు లక్ష్మి(manchu laxshmi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘దక్ష: ద డెడ్లీ కాన్స్పిరసీ’(Daksha: The Deadly Conspiracy).

ఓటీటీలోకి రాబోతున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu), మంచు లక్ష్మి(manchu laxshmi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘దక్ష: ద డెడ్లీ కాన్స్పిరసీ’(Daksha: The Deadly Conspiracy). యువ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, చిత్ర శుక్ల, సముద్రఖని, మహేష్, మలయాళ నటుడు సిద్ధిఖీ(Siddiqui) కీలక పాత్రలు పోషించారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ను మంచు ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలక్ష్మి ప్రసన్న సంస్థలు నిర్మించాయి. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్స్‌లోకి వచ్చింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విడుదలైన నెలరోజులకే ‘దక్ష’ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుపుతూ.. మంచు లక్ష్మి, మోహన్ బాబు, సముద్రఖని కలిసి ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. అలాగే దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More..

అసురుడు వచ్చేశాడు.. యుద్ధం తెచ్చేసాడు.. అంచనాలను పెంచుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్

Next Story