ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మునావర్ ఫరూఖీ

by Chukka Sudharani |   (  Updated:2022-08-31 14:30:47  IST  )

దిశ, సినిమా : స్టాండప్ కమెడియన్, యాక్టర్ మునావర్ ఫరూఖీ ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవాడినని తెలిపాడు.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మునావర్ ఫరూఖీ
X

దిశ, సినిమా : స్టాండప్ కమెడియన్, యాక్టర్ మునావర్ ఫరూఖీ ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవాడినని తెలిపాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా స్ట్రగుల్ అయ్యానని వివరించాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌కు సంబంధించిన న్యూస్ విని.. షేక్ అయిపోయానని, తను కూడా అదే పొజిషన్‌లో ఉంటాననే ఆలోచనతో భయపడిపోయానని తెలిపాడు.

ఆత్మహత్య గురించి విన్నప్పుడు.. తనకు అదే పొజిషన్ ఉంటుందేమోననే భయం వెంటాడుతుండేదని చెప్పాడు. నిజానికి తన తల్లి యాసిడ్ తాగి చనిపోయిందని.. ఆ ఘటనకు ముందు ఆమె ఎనిమిది రోజులు ఆహారం తీసుకోలేదని ఎమోషనల్ అయ్యాడు మునావర్ ఫరూఖీ. పెళ్లి అయినప్పటి నుంచి అమ్మ ఎప్పుడూ సంతోషంగా లేదని.. ఎప్పుడూ నాన్న కొడుతూ ఉండేవాడని బాధపడ్డాడు. 23ఏళ్లుగా రోజూ ఇలాంటి సంఘటనలు ఫేస్ చేసిన తనను సూసైడల్ థాట్స్ వెంటాడేవని చెప్పుకొచ్చాడు.

హనీమూన్ నుంచి పారిపోయిన హీరో..

Next Story