ఘనంగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి నిశ్చితార్థం

by Disha Web Desk 6 |
ఘనంగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి నిశ్చితార్థం
X

దిశ, సినిమా: దేశంలో అత్యంత సంపన్నుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖేష్ ట్విన్స్ ఆకాష్ అంబానీ, ఇషా అంబానీల నిశ్చితార్థం జరిగిన సమయంలో.. అనంత్ అంబానీ ప్రియురాలు రాధిక మర్చంట్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అప్పటి నుంచి అంబానీ కుటుంబంలోని ప్రతి ఫంక్షన్‌లో రాధిక మర్చంట్‌ కనిపిస్తూనే ఉంది. కాగా అందరూ అనుకున్నట్లుగానే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. తాజాగా నాథద్వారాలోని లార్డ్ శ్రీనాథ్‌జీ దర్బార్‌లో రాధిక-అనంత్ ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story