‘రౌడీ జనార్ధన్’ కు ముహూర్తం ఫిక్స్.. ఈ దసరా మరింత ప్రత్యేకం కాబోతుందంటూ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-29 14:11:52  IST  )

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గత కొద్ది కాలం నుంచి హిట్ కోసం తాపత్రయపడుతున్నాడు.

‘రౌడీ జనార్ధన్’ కు ముహూర్తం ఫిక్స్.. ఈ దసరా మరింత ప్రత్యేకం కాబోతుందంటూ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గత కొద్ది కాలం నుంచి హిట్ కోసం తాపత్రయపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌తో ఉన్నాడు. విజయ్ నటిస్తున్న చిత్రాల్లో ‘రౌడీ జనార్ధన్’ కూడా ఒకటి. ఈ మూవీ బడా నిర్మాణ సంస్థ SVCబ్యానర్‌లో రాబోతున్న 59వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ‘రౌడీ జనార్ధన్’(Rowdy Janardhan)లో విజయ్‌కు జోడిగా కీర్తి సురేష్ (Keerthy Suresh)నటిస్తోంది. తాజాగా, ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ‘రౌడీ జనార్ధన్’ పూజా కార్యక్రమాలు ఈ దసరా రోజు సెప్టెంబర్ 2న నిర్వహించబోతున్నట్లు టాక్. అలాగే ఈ దసరా అందరికీ మరింత ప్రత్యేకం చేయబోతున్నాడని తెలిపారు.

link

Next Story