‘AA-22’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఒక్క పోస్టర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్

by Mallepaka Hamsa |

ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు సన్ పిక్చర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

‘AA-22’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఒక్క పోస్టర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యే టైమ్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ సినిమాల స్పెషలిస్ట్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'AA-22' ఇప్పుడు యావత్ భారత సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు సన్ పిక్చర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. రేపు (ఏప్రిల్ 8న) బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో పడునైన, పొడవైన గోర్లు, దట్టమైన వెంట్రుకలతో ఒక క్రూర మృగం చేయి భయంకరంగా కనిపిస్తోంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ గమనిస్తే.. మేఘాల చాటున వింత కోటలు, చీకటి ఆకాశం కనిపిస్తున్నాయి.

ఇది ఒక ప్యారలల్ యూనివర్స్ కథ అని, మనం నివసించే ప్రపంచం కాకుండా మరో వింత ప్రపంచంలో జరిగే పోరాటమని అర్థమవుతోంది. అసలు ఆ చేయి ఎవరిది? బన్నీ ఏదైనా వింత శక్తి ఉన్న పాత్రలో నటిస్తున్నాడా? అనే చర్చ నెట్టింట మొదలైంది. ఇక ఈ పోస్ట్‌కు "బ్లాస్ట్ కోసం సిద్ధంకండి" అంటూ మేకర్స్ ఇచ్చిన హింట్ చూస్తుంటే, అల్లు అర్జున్ ఈ సినిమాలో నెవ్వర్ బిఫోర్ అవతారంలో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్ తనయుడు 'అయాన్' (Ayan)అనే పవర్‌ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో మొత్తానికి అట్లీ - బన్నీ కలిసి బాక్సాఫీస్ దగ్గర ఏదో పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది.

Next Story