సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్..టెంప్టిగ్‌గా ఉన్నా కాదంటున్నానంటూ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

చాలా మంది పెద్ద మేకర్స్ నన్ను సంప్రదిస్తున్నారు. వారు ఇచ్చే ప్యాకేజీలు, రెమ్యుూనరేషన్ చూస్తే నిజంగా చాలా టెంప్టింగ్ గా ఉంటుంది.

సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్..టెంప్టిగ్‌గా ఉన్నా కాదంటున్నానంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ గోల్డెన్ లెగ్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోంది. 'సీతారామం'లో సీత మహాలక్ష్మిగా, 'హాయ్ నాన్న'లో యష్ణగా తన నటనతో అందరినీ మాయ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన కెరీర్ విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న ‘డెకాయిట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మృణాల్, తను పెద్ద సినిమాలను ఎందుకు వదులుకుంటుందో క్లారిటీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుకలో మృణాల్ మాట్లాడుతూ.. "చాలా మంది పెద్ద మేకర్స్ నన్ను సంప్రదిస్తున్నారు. వారు ఇచ్చే ప్యాకేజీలు, రెమ్యుూనరేషన్ చూస్తే నిజంగా చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. కానీ, భారమైన హృదయంతో నేను వాటిని కాదనాల్సి వస్తోంది. ఎందుకంటే సీత మహాలక్ష్మి, యష్ణ వంటి పాత్రలు నా కెరీర్‌లో ఒక బెంచ్‌మార్క్ సెట్ చేశాయి. ఆ స్థాయిని తగ్గించేలా ఉండే ఏ సినిమాను నేను చేయదలచుకోలేదు.

దురాశ దుఃఖానికి చేటు అని నేను నమ్ముతాను. అందుకే ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా, కథ సరిగ్గా లేకపోతే 'సర్.. నేను మంచి సినిమా కోసం వెయిట్ చేస్తాను' అని చెప్పేస్తున్నాను" అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ఇక 'డెకాయిట్' ట్రైలర్ విషయానికి వస్తే, అడివి శేష్ తన మార్క్ యాక్షన్ తో అదరగొట్టేశాడు. అన్యాయంగా జైలుకు వెళ్లిన హీరో, తనను మోసం చేసిన మహిళపై ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి రావడం ఈ సినిమా మెయిన్ పాయింట్. తన జీవితాన్ని నాశనం చేసిన ఆ మగువపై పగ తీర్చుకోవాలా? లేక ఆమెను, ఆమె భర్తను ప్రమాదం నుంచి కాపాడాలా? అనే సందిగ్ధంలో సాగే ఈ డ్రామా ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది.ఈ ట్రైలర్ చూసిన మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వంటి స్టార్స్ సోషల్ మీడియా వేదికగా టీమ్‌ను అభినందిస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్ 10న బాక్సాఫీస్ వద్ద 'డెకాయిట్' సునామీ ఖాయంగా కనిపిస్తోంది.

Next Story