మృణాల్‌ ఠాకూర్‌‌కు IFFM అవార్డు.. ఫుల్ ఖుష్ అవుతున్న నటి

by Dishanational2 |
మృణాల్‌ ఠాకూర్‌‌కు IFFM అవార్డు.. ఫుల్ ఖుష్ అవుతున్న నటి
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ మృణాల్‌ ఠాకూర్‌‌ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ మేరకు త్వరలో ఆస్ట్రేలియాలో జరుగనున్న ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’లో డైవర్సిటీ ఇన్‌ సినిమా అవార్డుకు ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా మృణాల్‌కు సంబంధించిన గుడ్ న్యూస్‌ను అధికారికంగా ప్రకటించిన ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్’.. ‘భారతీయ భాషల్లో ప్రశంసాత్మక పాత్రల ద్వారా మృణాల్‌ ఠాకూర్‌ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కావున ఆమెకు ఈ అవార్డుకు ఎంపికచేశాం’ అని అవార్డుల కమిటీ పేర్కొంది. ఇక ఈ అవార్డుకు ఎంపిక కావడంపై స్పందించిన నటి.. ‘ఈ వార్త తెలియగానే చాలా సంతోషించా. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇది భవిష్యత్తులో మరిన్ని స్ఫూర్తివంతమైన పాత్రల్లో నటించడానికి ప్రేరణనిస్తుంది’ అంటూ మృణాల్‌ మురిసిపోయింది.

Read More: ‘చంద్రముఖి 2’ నుంచి కంగన ఫస్ట్ లుక్ రిలీజ్

Next Story

Most Viewed