దిష్టి తగులుతుంది.. అన్నీ ఓపెన్‌గా చెప్పలేను.. ధనుష్‌తో డేటింగ్‌పై మృణాల్

by Sujitha Rachapalli |

హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ న్యూస్ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు వీళ్లిద్దరు ఎక్కడ కలిశారు? ఎలా కలిశారు? అసలు ఏం జరుగుతోంది? నిజంగా వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా?

దిష్టి తగులుతుంది.. అన్నీ ఓపెన్‌గా చెప్పలేను.. ధనుష్‌తో డేటింగ్‌పై మృణాల్
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ న్యూస్ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు వీళ్లిద్దరు ఎక్కడ కలిశారు? ఎలా కలిశారు? అసలు ఏం జరుగుతోంది? నిజంగా వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా? ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ స్క్రీనింగ్‌కు ఆయన ఎందుకు వచ్చాడు? మృణాల్ పిలిచిందా? లేక డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోతో రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? అనే వందల డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ఈ మూవీ ప్రమోషన్స్ టైంలో మృణాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ టాపిక్ వైరల్ అవుతోంది.

‘జీవితంలో జరగబోయే చాలా విషయాల గురించి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. నేను వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. నజర్ ఉందని నేను నమ్ముతాను. పబ్లిక్‌లో క్లియర్ బౌండరీస్ సెట్ చేసి.. నా ప్రశాంతతను మెయింటెన్ చేస్తాను. మనం ప్రపంచానికి ఏం చెప్పాలనే విషయంలో కచ్చితంగా లిమిట్స్ ఉండాలి. ఒక్కోసారి ఎక్కువ చెప్పి మనమే ప్రాబ్లమ్స్‌లో పడుతాం’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాలన్నింటిని ధనుష్‌తో డేటింగ్‌కు లింక్ చేస్తూ.. ఈ దిష్టి గురించి మాట్లాడింది ఇందుకేనేమోనని అనుమానిస్తున్నారు.

Next Story