ధనుష్ కాదు... మరో తమిళ్ హీరోతో మృణాల్ రొమాన్స్?

by velandi.Saikiran |

వ కార్తికేయన్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ ఫైనల్

ధనుష్ కాదు... మరో తమిళ్ హీరోతో మృణాల్ రొమాన్స్?
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే.. స్టార్ హీరోయిన్లుగా మారుతారు. మరికొంతమంది ఎంత కష్టపడ్డా... పైకి రాలేరు. ఇక మరికొంతమంది ఒక్క సినిమాతోనే... ఇండస్ట్రీని మొత్తం తమ వైపు తిప్పుకుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ ( Mrunal Thakur ) ఒకరు. మహారాష్ట్రకు సంబంధించిన ఈ అందాల తార గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

సూపర్ 30 అనే బాలీవుడ్ సినిమాతో మెరిసిన ఈ బ్యూటీ... తెలుగులో 2022 సంవత్సరంలో వచ్చిన సీతారామం మూవీతో ఎంట్రీ ఇచ్చారు మృణాల్‌ ఠాకూర్‌. ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. మొదట్లో కోటి కంటే తక్కువ తీసుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్లు ఛార్జ్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ అందాల తార మృణాల్‌ ఠాకూర్‌ కు మరో అవకాశం వచ్చిందట. శివ కార్తికేయన్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా హీరో ధనుష్ తో మృణాల్‌ ఠాకూర్‌ కు ఎఫ్ఫైర్ ఉన్నట్లు.. మొన్నటి వరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story