- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్- అట్లీ మూవీలో అలాంటీ పాత్రలో మృణాల్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ‘AA-24’వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై వస్తున్న పుకార్లు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతూ.. సినీ ప్రియుల్లో ఆతృతను పెంచుతున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఒక పవర్ ఫుల్ డాన్ కథగా రాబోతున్నట్లు టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా.. ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ వెతుకులాట మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి ఇందుకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా ఆసక్తి నెలకొంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనుందట. తాజాగా, ఈ సినిమాలో మరో బ్యూటీ జాయిన్ కాబోతున్నట్లు ఆమె పాత్రకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఈ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అందరూ ఊహించనట్లుగా ఇందులో మృణాల్ హీరోయిన్‌గా కాకుండా అల్లు అర్జున్‌కు చెల్లెలు పాత్రలో కనిపించనుందట. ఎంతో ఎమోషనల్ టోన్ ఉన్న పాత్ర చుట్టూనే కథ మలుపు తిరుగుతుందని టాక్. ఇక ‘సీతారామం’లో సీతగా చేసిన మృణాల్ అందరి గుండెళ్లో చెరగని ముద్ర వేసుకుంది.
అలాగే ‘హాయ్ నాన్న, కల్కి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాపులారిటీ పెంచుకుంది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాంటిది మృణాల్‌ను అల్లు అర్జున్ చెల్లెలుగా చూపించడం ఏంటనీ నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం అస్సలు వద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే సక్సెస్ అవుతున్న సమయంలో ఇలాంటి రిస్క్ అవసరమా? అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఐకాన్ స్టార్‌లో మృణాల్ పాత్రకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Read More..
AA22xA6 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...టీజర్ వచ్చేస్తోంది !






