AA22xA6 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌...టీజ‌ర్ వ‌చ్చేస్తోంది !

by velandi.Saikiran |   (  Updated:2025-12-18 04:39:28  IST  )

AA22xA6 మూవీకి ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం

AA22xA6 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌...టీజ‌ర్ వ‌చ్చేస్తోంది !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు అల్లు అర్జున్ వెళ్ళాడు. అయితే ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ AA22xA6 మూవీకి ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో వస్తోంది.

సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఫాంటసీ కథ ఆధారంగా ఈ మూవీ వస్తోంది. ఇందులో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడట. దీపికా పదుకొనె , మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీని రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఏప్రిల్ మాసంలో టైటిల్ టీజర్ అనౌన్స్ చేయబోతున్నారట. దాంతో పాటు సినిమాలోని పాత్రలను రివీల్ చేసే ఛాన్సులు ఉన్నట్లు సమాచారం. ఈ మేర‌కు ఓ న్యూస్ వైర‌ల్ గా మారింది.

Read More..

అల్లు అర్జున్- అట్లీ మూవీలో అలాంటీ పాత్రలో మృణాల్‌.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు!

Next Story