మృణాల్ ఠాకూర్ అందం.. అడివి శేష్ యాక్షన్.. 'డెకాయిట్' ట్రైలర్‌లో అదిరిపోయిన కెమిస్ట్రీ!

by Mallepaka Hamsa |

అనుకోని పరిస్థితుల్లో హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అసలు హరి జైలుకు ఎందుకు వెళ్ళాడు? ఆ సమయంలో జూలియట్ పరిస్థితి ఏంటి?

మృణాల్ ఠాకూర్ అందం.. అడివి శేష్ యాక్షన్.. డెకాయిట్ ట్రైలర్‌లో అదిరిపోయిన కెమిస్ట్రీ!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక పక్కా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మూవీ మేకర్స్ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా, విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ ఆరంభంలో హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్)ల మధ్య ఉన్న అందమైన ప్రేమకథను చూపించారు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని, తమ కొత్త జీవితాన్ని అందంగా ప్లాన్ చేసుకుంటారు. అంతా సవ్యంగా సాగిపోతోంది, త్వరలోనే పిల్లల గురించి కూడా ఆలోచిద్దాం అనుకుంటున్న సమయంలో కథలో ఒక ఊహించని పెద్ద మలుపు వస్తుంది.

అనుకోని పరిస్థితుల్లో హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అసలు హరి జైలుకు ఎందుకు వెళ్ళాడు? ఆ సమయంలో జూలియట్ పరిస్థితి ఏంటి? జైలు నుంచి బయటకు వచ్చిన హరి తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే అంశాలను ట్రైలర్‌లో చాలా ఇంటెన్సివ్ గా, సస్పెన్స్ గా చూపించారు. ట్రైలర్‌లో అడివి శేష్, మృణాల్‌ల మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ ఫ్యాన్స్‌ను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఇక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ ని మరో మెట్టు ఎక్కించాయి. రొమాన్స్‌ను, రివెంజ్ డ్రామాను దర్శకుడు షానిల్ డియో చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి 'డెకాయిట్' ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచింది.


Next Story