- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mrunal Thakur: పెళ్లైన హీరోతో డేటింగ్ చేస్తున్న మృణాల్.. సంచలనంగా మారిన వీడియోలు.. పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వీరిద్దరు పలు ఈవెంట్స్‌లో క్లోజ్‌గా కనిపించడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే మృణాల్, ధనుష్ ఒక వేడుకలో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మృణాల్ తన బర్త్ డే వేడుకలకు కూడా ధనుష్ వెళ్లారు. ఆమె చేతిని పట్టుకుని మరీ ఆత్మీయంగా మాట్లాడుతున్న వీడియో కూడా బయటపడింది.
దీంతో పాటు ధనుష్ తన ప్రియురాలు నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్-2’ (Son of Sardaar-2)స్పెషల్ స్క్రీనింగ్ కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ షోకు మృణాల్‌తో కలిసి వెళ్లగా అక్కడ కూడా వీరిద్దరు చెవిలో గుసగుసలాడుకున్నారు.ఇక ఇటీవల ‘తేరే ఇష్క్ మే’ షూటింగ్ పూర్తైన సందర్భంగా చేసుకున్న పార్టీకి కూడా మృణాల్ వెళ్లినట్లు టాక్. ఇందులో ఆమె నటించినప్పటికీ పార్టీకి మాత్రం ధనుష్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పెళ్లైన హీరోతో నీ రొమాన్స్ ఏంటి సిగ్గుండాలంటూ పొట్టు పొట్టుగా తిడుతున్నారు.
పెళ్లైన హీరోతో డేటింగ్ చేయడమేంటని విమర్శలు చేస్తున్నారు. కాగా, ధనుష్‌కు ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ధనుష్, ఐశ్వర్య మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొద్ది కాలం క్రితమే విడాకులు తీసుకుని విడిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్నప్పటికీ నుంచి ఐశ్వర్య తన తండ్రి ఇంట్లోనే ఉంటుంది. ధనుష్ మాత్రం నిర్మాతగా, హీరోగా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయాడు.






