- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మృణాల్..
ప్రేమ, గందరగోళం, పిచ్చి, అలజడి ఇప్పుడే మొదలవుతుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తెరకెక్కిన క్రేజీ ఎంటర్టైనర్ విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న గందరగోళానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెక్ పెట్టింది. నిజానికి ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ, ఆ తర్వాత జూన్ 5కి మార్చారు. ఇప్పుడు అంతకంటే ముందే, అంటే మూడు వారాల ముందే మే 22న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. "ప్రేమ, గందరగోళం, పిచ్చి, అలజడి ఇప్పుడే మొదలవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఏప్రిల్ 13న రాబోతోంది.. మే 22న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది" అని పోస్ట్ పెట్టింది.
అయితే ఇంతియాజ్ అలీ ‘మై వాపస్ ఆవుంగా’ సినిమాతో వచ్చే రిస్క్ తీసుకోకుడదని మేకర్స్ తెలివిగా విడుదల తేదీని ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మే 22న కూడా వరుణ్ ధావన్ సినిమాకు గట్టి పోటీ ఎదురుకానుంది. అదే రోజు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘చాంద్ మేరా దిల్’, అనురాగ్ కశ్యప్ ‘బందర్’ వంటి చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు తప్పదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించాయి. అందుకే ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో టిప్స్ సంస్థ తరపున రమేష్ తౌరానీ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతుండటం విశేషం.






