- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్ర ప్రసాద్ గారు మీరు గ్రేట్.. వివాదానికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన విశాల్!
ఎంజీఆర్ గారిపై మీరు చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత కేవలం మా జనరేషన్ మాత్రమే కాదు, ఆయనతో కలిసి ప్రయాణించిన ఎంతోమంది సీనియర్లు కూడా చాలా బాధపడ్డారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ (MGR) మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. ఇటీవల ఒక అవార్డు వేడుకలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే, దీనిపై రాజేంద్ర ప్రసాద్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పడంతో, తమిళ నటుడు, 'నడిగర్ సంగం' ప్రధాన కార్యదర్శి విశాల్ ఆయనను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసిన తర్వాత విశాల్ ఒక ప్రకటన చేశారు. "నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు క్షమాపణలు చెప్పినందుకు చాలా థాంక్స్. ఎంజీఆర్ గారిపై మీరు చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత కేవలం మా జనరేషన్ మాత్రమే కాదు, ఆయనతో కలిసి ప్రయాణించిన ఎంతోమంది సీనియర్లు కూడా చాలా బాధపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. అందుకే మేము 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్' తరపున మిమ్మల్ని క్షమాపణలు కోరాలని రిక్వెస్ట్ చేశాం" అని విశాల్ తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ పెద్ద మనసును అభినందిస్తూ విశాల్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ, జరిగిన తప్పును వెంటనే అంగీకరించి అపాలజీ చెప్పడం నిజంగా గ్రేట్ సార్. రేపు మీలాంటి పెద్ద నటుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా మేము ఇలాగే స్పందిస్తాం. మా రిక్వెస్ట్‌ను గౌరవించి వివాదానికి ముగింపు పలికినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నిజంగా గొప్ప మనిషి" అంటూ విశాల్ గౌరవాన్ని చాటుకున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా ఇరు పరిశ్రమల మధ్య సాగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లయింది.






