వివాదంలో ‘మోగ్లీ’.. ఈ అన్యాయాన్ని సహించలేనంటూ నటుడు సంచలన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్‌గా మారిన ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-01 16:07:46  IST  )

యాంకర్ కొడుకు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న రెండో ప్రాజెక్ట్ ‘మోగ్లీ’(Mowgli).

వివాదంలో ‘మోగ్లీ’.. ఈ అన్యాయాన్ని సహించలేనంటూ నటుడు సంచలన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: యాంకర్ కొడుకు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న రెండో ప్రాజెక్ట్ ‘మోగ్లీ’(Mowgli). సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి మడోల్కన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘మోగ్లీ’ సినిమా చిక్కుల్లో పడింది. తను చేసిన విలన్ క్యారెక్టర్‌పై వస్తున్న ప్రశంసలను మూవీ టీమ్ వాటిని డిలీట్ చేసి తనకు అన్యాయం చేస్తోందని సరోజ్ కుమార్ సంచలన ట్వీట్ పెట్టాడు. ‘‘కామెంట్స్ ఏ కదా... లైట్ తీసుకోమని చెప్పేవాళ్ళకి. నేను ఇప్పటి వరకూ బయట సినిమాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్నాక, నా పాత్ర నచ్చి అందులో ఎటువంటి మార్పులు ఉండకూడదు అనే అగ్రిమెంట్ తో ఈ సినిమాలో పారితోషికం లేకుండా ప్రాణం పెట్టి నటించాను. 8 నెలలు నా సమయాన్ని ఇచ్చాను. నాకు వస్తున్న రిసెప్షన్ చూసి ముందు థంబ్ నెయిల్స్ మార్చారు. తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. నేను దర్శకుడితో మాట్లాడాక మళ్ళీ ఆన్ చేశారు.

ఒక 3 కామెంట్లను బాట్ లికెస్ తో బూస్ట్ చేసి, నా రోల్ కి వస్తున్న ఆదరణను మ్యాచ్ చేయడానికి చూసారు. కుదరలేదు. ఇప్పుడు నా టాప్ కామెంట్లు డిలీట్ చేశారు. ఇంకా డిటైల్డ్ గా ప్రూఫ్స్ తో ముందుకు వస్తాను. ఇప్పటికీ అక్కడ ఉన్న 1600 కామెంట్లలో 99% నా పైన ప్రేక్షకుడు పలికించిన ప్రేమే. నాకు పీఆర్ లు లేరు.. ప్రేక్షకుడి బలమే నా పీఆర్. ఆ సునామీని ఎవ్వడూ ఆపలేరు. కానీ వీళ్లు ఇప్పుడే ఇలా చేస్తే, రేపు సినిమాలో ఎన్ని చేస్తారు. ఎవరిని నమ్మాలి. నిర్మాత వరకూ వెళ్ళే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతికేయడానికి రాలేదు. గత 5 సంవత్సరాలుగా నా కళతో నేను ప్రేక్షకుల్ని సంపాదించుకున్నాను. ఇలాంటి ఇన్ సెక్యూర్ నెపోటిజం, పాలిటిక్స్ ని నేను అస్సలు బేర్ చెయ్యను. వాళ్లు చేసిన పనికి నేను బయటపెడతాను. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఇది ప్రమేయం లేకుండా జరుగుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చౌకబారు బంధుప్రీతికి అడ్డాగా ఉండకూడదు. దీని వల్ల నా బాధ, నా భవిష్యత్తు కెరీర్ పట్ల ఉన్న భయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ నా గురించి పెట్టిన 400కి పైగా కామెంట్స్ ను తొలగించారు. ఇంకా అదే పనిలో ఉన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ దీనిని తీవ్రంగా పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఇది కంటెంట్ ఫిల్మ్ అని, లాంచ్-ప్యాడ్ ఫిల్మ్ కాదని నాకు చెప్పారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యాను. నేను దీని కోసం నా సర్వస్వం పెట్టాను. ఎలాంటి కండిషన్స్ లేకుండా బేషరతుగా పనిచేశాను. ఇందుకు నాకు దక్కిన ఫలితం ఇదే. దీని వెనుక ఒక సీరియస్ సిండికేట్ ఉంది. ఇది ఆమోదయోగ్యమైనదేనా? నిర్మాతపై పూర్తి నమ్మకం గౌరవంతో, దీనిని పరిశీలించమని నేను కోరుతున్నాను.. ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Next Story